బెంగుళూరులో ఇద్దరికి HMVP వైరస్ పాజిటివ్ .! 1 d ago
చైనాలోని హెచ్ఎంపీవీ వైరస్ కలకలం కొనసాగుతున్న వేళ, భారత్ లో కర్ణాటక రాష్ట్రంలో ఈ వైరస్‌ను గుర్తించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. బెంగళూరులో 3, 8 నెలల వయసున్న ఇద్దరు చిన్నారుల్లో ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. చైనాలో హెచ్ఎంపీవీ సహా పలు శ్వాసకోశ వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని వార్తలొస్తున్న నేపథ్యంలో, భారత్ ఈ పరిస్థితులపై అప్రమత్తమైంది. ఇటీవలే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అధ్యక్షతన జాయింట్ మానిటరింగ్ గ్రూప్ సమావేశం ఏర్పాటు చేసింది.